Logo
Date of Publish : 29 October 2022, 2:35 pm
Editor : Sake Naresh

వెల్లంపల్లి శ్రీనివాసరావు సత్తా ప్రభుత్వ భూములు కబ్జా చేయడం వ్యాపారస్తులు దగ్గర దండుకోవడమే

- బీసీలను నగరాలను అవమానిస్తే చూస్తూ ఊరుకోం
- వెల్లంపల్లి శ్రీనివాసరావు & కో బ్యాచ్ నీ నడిరోడ్డు మీద నుంచో పెడతాం.
- జనసేనపార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ పోతిన వెంకట మహేష్
     విజయవాడ, (జనస్వరం)  : వెల్లంపల్లి శ్రీనివాసరావు సత్తా ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, దమ్ము వ్యాపారస్తులు దగ్గర దండుకోవడం.. అని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ పోతిన వెంకట మహేష్ అన్నారు. తన కార్యాలయంలో నుంచి శనివారం విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాస సత్తా ప్రభుత్వ భూమి కబ్జా చేసి వెల్లంపల్లి ఫౌండేషన్ పేరు పెట్టుకోవడమా అని అన్నారు. దమ్ముంటే వ్యాపారస్తులు దగ్గర నుంచి అక్రమంగా దండుకోడమా అని, పవన్ కళ్యాణ్ పశ్చిమలో సమీక్షలు నిర్వహిస్తారంటే వెల్లంపల్లి శ్రీనుకు ఉలుకు ఎందుకని, సమీక్షలు పశ్చిమ నియోజకవర్గం నుంచి నిర్వహించడం అంటే నగరాలు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ నుంచి మొదలు పెట్టడం అంటే బీసీలకు నగరాలకు ఎంతో గౌరవం ఇస్తున్నట్టు అని, మరొకసారి బీసీలు గురించి, నగరాలు గురించి తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోమని, వెల్లంపల్లి శ్రీనివాస్ కి బీసీ లంటే చిన్న చూపని తేలిపోయిందని, వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఓడించడానికి నేను చాలని, రాబోయే ఎన్నికలలో సీటు ఇస్తారో లేదో అనే భయంతోనే పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని జగన్ మెప్పు పొందేందుకే ఈ ప్రయత్నాలని, వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిని బట్టబయలు చేసి మంత్రి పదవి నుంచి తొలగించడంలో సఫలీకృతం అయ్యామని, వెల్లంపల్లి శ్రీనివాస్ తన కో బ్యాచ్ అడ్డం పెట్టుకుని కార్తీక వన సమారాధన పేరుతో వ్యాపారస్తులు బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని, వారి సామాజిక వర్గాస్తుల్ని వద్ద దందాలు చేస్తున్నారని, రాబోయే రోజుల్లో వెల్లంపల్లి అండ్ కో బ్యాచ్ ని నడిరోడ్డు మీదకు తీసుకొస్తామని, కోకో బ్యాచ్ నీ బట్టలు ఊడదీసి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని, వ్యాపారస్తులలో తిరుగుబాటు మొదలైందని వారందరినీ వెంటబెట్టుకొని రాబోయే కాలంలో తగిని రీతిలో వెల్లంపల్లికి కోకో బ్యాచ్ కి బుద్ధి చెబుతానని హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com