దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ అసమర్ధుడు, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ : ఈమని కిషోర్ కుమార్, జనసేన నాయకులు
రాష్ట్రంలో హిందూ దేవాలయాల పైన జరుగుతున్న వరుస దాడులుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ మండిపడ్డారు. అంతర్వేది రథం ఘటన మరువకముందే రాజమండ్రిలో వినాయకుని విగ్రహానికి మలాన్ని పూయడం, నిన్న విజయవాడ కనకదుర్గ ఆలయంలో రధానికి ఉన్న మూడు వెండి సింహాల ను అపహరించడం, ఈరోజు నిడమనూరు లో ఉన్న షిరిడి సాయిబాబా దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేయటం ఇలా దాడులు జరుగుతున్న నిందితుల్ని పట్టుకోకపోవడం కొత్త సందేహాలకు దారితీస్తుందని ఆయన వివరించారు. మంత్రిగారి ఇంటి సమీపంలో ఉన్న కనకదుర్గ ఆలయంలో చోరీ జరగడం చూస్తే ఆలయంలోని నిఘా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో అవినీతి జరుగుతున్న దోపిడీలకు పాల్పడుతున్న చర్యలు తీసుకోని దుర్గ గుడి ఈవో సురేష్ కుమార్ ని ఎందుకు విధుల నుండి సస్పెండ్ చేయట్లేదు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు పైన జరుగుతున్న దాడులు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని వారు తిరగబడక ముందే నిందితులని పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో హిందువుల తరుపున జనసేన, బీజేపీ కూటమి ఎంతటి పోరాటానికైనా తిరుగుబాటు కైనా వెనకాడబోమని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హిందువుల దేవాలయాల పై జరుగుతున్న దాడికి నైతిక బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com