Logo
Date of Publish : 28 August 2022, 6:24 am
Editor : Sake Naresh

మండపేటలో మెగా రక్తదాన శిబిరం, విజయవంతం చేయాలని వేగుళ్ళ లీలాకృష్ణ పిలుపు

           కపిలేశ్వపురం : సెప్టెంబర్ 2వ తేదీన జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మండపేటలో పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వల్లూరు గ్రామంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధినేత పుట్టినరోజున మండపేట పట్టణంలో కాపు కళ్యాణ మండపం నందు నిర్వహించబోయే మెగా రక్తదాన శిబిరంలో జనసైనికులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేయవలసినదిగా లీలాకృష్ణ గారు కోరారు. ఆరోజు ఉదయం 9గంటల నుండి ప్రారంభం అయ్యే రక్తదాన శిబిరం సాయంత్రం వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరం గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

వినాయకచవితికి నిబంధనలా??
హిందువులు మనోభావాలు దెబ్బతీయడం సబబు కాదు... విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడుకి హిందువులు విశ్వాసంతో తొలి పూజ చేస్తారని, అటువంటి హిందువులు మనోభావాలు దెబ్బతినేలా గణపతి ఉత్సవాలుకు వైసీపీ ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టడం శోచనీయమని లీలాకృష్ణ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సరాకుల అబ్బులు, మండపేట మండల అధ్యక్షులు కుంచె ప్రసాద్, కపిలేశ్వరపురం మండల అధ్యక్షులు తుట్టుపు నాగరాజు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు మామిడాల మనోకృష్ణ, చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు కొంతం నాగేంద్ర ప్రసాద్, వల్లూరు సర్పంచ్ దాసి ఈశ్వరరావు,వల్లూరి సత్య ప్రసాద్ , చెల్లూరు ఎంపీటీసీ గొల్లపల్లి వెంకటరమణ, జనసైనికులు మరియు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com