మండపేట ( జనస్వరం ) : కపీలేశ్వరపురం మండలం, అద్దంకివారిలంక శివారు పల్లపులంక నుండి 10వ రోజు "జన చైతన్య యాత్రను" వేగుళ్ళ అనిత ప్రారంభించారు. ముందుగా లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని యాత్రను ప్రారంభించారు. గ్రామంలో ప్రతి ఇంటింటికీ తిరుగుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ సిద్ధాంతాలను మరియు యాత్ర ముఖ్య ఉద్దేశాలను ప్రజలకు వివరించారు. మార్పు కోసం రానున్న ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి వేగుళ్ళ లీలాకృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com