భీమవరం ( జనస్వరం ) : వీరవాసరం మండలం పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. అందులో భాగంగా మండలంలో ఉన్న అధికారాలతో సమీక్ష సమావేశంలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో జనసేన ఎంపిటిసి లు వివిధ సమస్యల మీద చర్చించారు. అందులో ముఖ్యంగా ఆర్ఎంబి వారితో రోడ్లు దుస్థితి గురించి మంచి నీరు, డ్రైనేజ్ వ్యవస్థ గురించి కూడా వివరించాము. అంతేకాకుండా మండల పరిషత్తు నిధులు కోటి 50 లక్షలు ఉండగా వాటితో ఎటువంటి అభివృద్ధి పనులు జరగకుండా శాసనసభ్యులైన గ్రంధి శ్రీనివాస్ ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి చెయ్యలేదన్నారు. మీటింగ్ లో కూడా ప్రస్తుత ఇంచార్జ్ ఎంపీడీవో గారితో ఇదే విషయాన్ని అడగగా ఆయన కూడా మాకు సహకరించడం లేదని, ఈ నిధులు విషయంగా ఇప్పటివరకు ముగ్గురు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లిపోవడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుత ఇన్చార్జి ఎండిఓ గారి పరిస్థితి కూడా అదే ఇది ఇలానే ఉంటే మా మండలంలో అభివృద్ధి కుంట పడుతుంది కాబట్టి స్థానిక శాసనసభ్యులు వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నామని జనసేన ఎంపిటిసి లు గూల్లపల్లి విజయలక్ష్మి, వర్ధినీది వెంకటలక్ష్మి, యల్లబండి ఇందిర, గొది ఆదిలక్ష్మి, కందుకూరి విజయకుమారి అన్నారు.