Logo
Date of Publish : 23 March 2022, 9:09 am
Editor : Sake Naresh

ముదినేపల్లి మండలంలో క్రియాశీలక సభ్యత్వం పై అవగాహన కల్పించిన జనసేన నాయకులు వీరంకి వెంకయ్య

    ముదినేపల్లి, (జనస్వరం) : కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం వనుదుర్రు గ్రామంలో జనసేన పార్టీ ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య క్రియాశీలక సభ్యత్వముపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించలేదని, కేవలం జనసేన పార్టీకి మాత్రమే చెల్లిందని, ఈ అవకాశాన్ని ప్రతీఒక్క కార్యకర్త వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్లకి అనుకోకుండా ఎటువంటి ప్రమాదం అయినా జరిగితే వైద్య ఖర్చుల నిమిత్తం 50 వేలు, మరణించినట్లయితే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, జనసేన నాయకులు, వెంట్రపాటి వెంకన్న, అంబుల భరత్, మాట్లపుది మధన, సుడాబత్తుల సాయీష్, వాలిశెట్టి బాబీ, బోయిన వాసు, పొన్నాముది ఫణికుమార్, బోయిన దుర్గా రావు, జంగం కొండలరావు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com