Logo
Date of Publish : 19 November 2022, 3:34 pm
Editor : Sake Naresh

నెల్లూరు జనసేనపార్టీ ఆధ్వర్యములో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

    నెల్లూరు, (జనస్వరం) : జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ సూచనలతో నెల్లూరు రూరల్ జనసేన 33 వ డివిజన్ కమిటీ ఇంచార మనీషా ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధురాలు భారత మహిళా శక్తిని, సాధికారతను చాటిన వీర మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో లైంగిక వేధింపులకు గురైన పేద మైనర్ బాలిక విషయంలో బాధితురాలికి జనసేన పార్టీ తరఫున అండగా నిలబడి నిందితున్ని అరెస్టు చేయించిన కమిటీ లీగల్ కమిటీ సభ్యురాలు సుభాషినికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ ఇంతమంది మహిళలు ఈ డివిజన్ నుంచి జనసేనపార్టీకి మద్దతుగా నిలవడం శుభపరిమాణం అని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు సాధారణ కుటుంబాల నుంచి మహిళలు బయటకు వచ్చి వారి సమస్యలు సాధికారతకు ప్రయత్నించాలని చెబుతుంటారు. దేశం కోసం పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో సమాజంలో జరుగుతున్న రుగ్మతలను రూపు మాపేందుకు ప్రతి మహిళా ఒక కాళికాదేవి కావాలని తెలిపారు. సగటు కుటుంబాల నుంచి మహిళలు వస్తే కుటుంబాలలో జరిగే ఇబ్బందులు తెలిసి పాలనపరంగా మార్పులు వస్తాయి అని తెలిపారు. మహిళలకు అందరికి అండగా మహిళా కమిటీ మరియు లీగల్ టీం ఉందని ఏ సమస్య వచ్చినా మీ తరఫున జనసేన పార్టీ అండగా నిలబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కృష్ణ పెన్నా జిల్లాల మహిళా కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శులు ఆలియా, సావిత్రి, రాధమ్మ, మహిళా నాయకురాలు కృష్ణవేణి, కస్తూరి, సుజాత, మనీషా, జిల్లా కార్యదర్శులు పూసల మల్లేశ్వర రావు, ప్రశాంత్ గౌడ్, స్థానిక జనసేన నాయకులు రాజా శంకర్, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com