పాడేరు, (జనస్వరం) : విశాఖజిల్లా పాడేరు జనసేన పార్టీ వీరమహిళ నాయకురాలు కిట్లంగిపద్మ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే జనసేన పార్టీలో పార్టీ బలోపేతానికి ప్రజల సమస్యల మీద గళం విప్పడానికి నాకు అవకాశాన్ని కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసారు. పార్టీ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని పార్టీ గ్రామ స్థాయి నుండి క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా కృషి చేస్తానని తెలియజేశారు. అలాగే 2024 లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసే విధంగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. అలాగే జనసేన పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న జనసైనికులకి, జనసేన పార్టీ వీరమహిళలకు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ఎక్ససిక్యూటివ్ కమిటీ మెంబెర్ కొర్ర కమల్ హాసన్, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, ఆనంద్, రాజు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com