వీరఘట్టం, (జనస్వరం) : మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం జనసేనపార్టీ ఆధ్వర్యంలో గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా 28వ రోజు గ్రామాల్లో జనసేన నాయకులు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెక్కలి జనసేన కార్యాలయంపై వైసీపీ దాడిని తీవ్రంగా ఖండించడం జరిగింది. జనసేన జానీ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంపై వైసీపీ పార్టీకి చెందిన దువ్వాడ శ్రీనివాస్, వాడి తొత్తులు దాడికి పాల్పడిన విధానం చూస్తే ఆ పార్టీ నేతలు దౌర్జన్యాలు ప్రజలందరికీ అర్థమవుతున్నాయి. ఈ కాలంలో ఇలాంటి దాడులు ఎంత మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని అలానే ప్రస్తుతం రాజకీయాలు గురించి యువత తెలుసుకుని ఎలాంటి అధికారం లేకుండా ప్రజలకు, కౌలు రైతులుకి 30 కోట్ల రూపాయిలు పంచిన పవన్ కళ్యాణ్ అలాంటి నాయకులకి ప్రజలు అందరూ అండగా ఉండాలి అని జనసేన జానీ అన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స పుండరీకం మాట్లాడుతూ రాష్ట్రములో వైస్సార్సీపీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారు. రాజధానులు పేరిట రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో అలజడులు సృష్టిస్తున్నారు. మూడున్నర ఏళ్ల పాలనలో ఏమి సాధించారు. అసెంబ్లీలో మెజార్టీ ఉంది, ప్రభుత్వంలో ఉండి కూడా విశాఖ గర్జన, మంత్రులు యాత్రలు ఎందుకు? ధర్మాన ప్రసాద్ మంత్రి పదవికి రాజీనామా పేరుతో నాటకాలు ఆడుతున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి రాష్ట్రంలో ఆదరణ పెరుగుతున్నoదున అది చూసి వైస్సార్సీపీ ఓర్వలేకపోతుంది. రాబోయే ఎన్నికల్లో వైస్సార్సీపీ ఓటమి తధ్యం అందుకే చిత్ర విచిత్రమైన నాటకాలు ప్రదర్శిస్తున్నారు. టెక్కలి జనసేన కార్యాలయంపై దాడికి పాల్పడిన వైస్సార్సీపీ గుండాలను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కర్నెనా సాయిపవన్ మాట్లాడుతూ వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు గురించి వ్యక్తిగత జీవితాలు గురించి తరువాత మాట్లాడుదురు గానీ ముందు రోడ్లు వేయండి అని, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని వైస్సార్సీపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు.