
విజయనగరం ( జనస్వరం ) : డిఆర్ వలస గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు (విద్యార్థులు) రక్తహీనత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయ నిమిత్తం వెదుల్లవలస గ్రామం తరపున గత రెండు, మూడు రోజుల నుండి ఫోన్ పే ద్వారా అమౌంట్ సేకరించారు. చేసిన ఆ మెత్తాన్ని బాధిత కుటుంబానికి రూ. 41000 అందించడం జరిగింది. సహాయం అందించిన వెదుల్లవలస ఎంప్లాయిస్, యూత్ మరియు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలమండ రామునాయుడు, మన్నెపూరి శ్రావణ్ కుమార్, మన్నెపూరి గణపతి పాల్గొన్నారు.