ఉత్తరాంధ్రలో పర్యావరణాన్ని విఘాతం కలిగిస్తున్న వైసీపీనేతల మైనింగ్ మాఫియా : వన్నెంరెడ్డి సతీష్ కుమార్
విశాఖజిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం రామవరం గ్రామంలో సర్వే నెంబర్121లో గనులశాఖ, కేంద్ర పర్యావరణ శాఖ, కాలుష్యనియంత్రణ శాఖ అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వకాల వల్ల కోట్ల రూపాయల ప్రభుత్వధనం దోపిడీ జరిగింది. దోపిడీ చేసిన వైసిపి నేతలపై రెవిన్యూ కేసులు లేవు, నెల రోజులు కావస్తున్నా ఇప్పటివరకు జరిమానా రూపంలో విజిలెన్స్ ఎంక్వయిరీలో కోట్ల రూపాయల్లో ప్రభుత్వ ఆదాయం కోల్పోతే, లక్షల్లో వసూలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఈ మండలంలో గిడిజాల, దిబ్బడపాలెం, తర్లువాడ, మెట్టమీద పాలెం, సొంట్యం, ఎల్ వి పాలెం, బాకురపాలెం కణమం, వెల్లంకిలో కొండను తవ్వి వేసి పేదల ఇళ్ల పట్టాలు చదును అని చెప్పి వైసీపీ నేతలు గ్రావెల్ దోపిడీ చేశారు. పెందుర్తినియోజకవర్గం పరవాడలోనూ, సబ్బవరం మండలం గొర్లివానిపాలెం, అసకపల్లి, గొట్టేవాడ, అమృత పురం లో వైసీపీ నేతల గ్రావెల్ దోపిడి వలన ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. అనకాపల్లి నియోజవర్గం అనకాపల్లి రూరల్ ఏరియాలో 30కోట్ల పైగా మైనింగ్ దోపిడి జరిగిన ఇప్పటివరకు చర్యలు లేవు. ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార్ల కొండ అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వకాలు జరిగాయి గనుల శాఖ జరిమానా విధించినా మైనింగ్ మాఫియా, స్థానిక ఎమ్మెల్యే ఆగడాలు అరికట్టలేకపోతున్న వైసిపి ప్రభుత్వం గాలి, నీరు, కొండలు, గనులు, ఖనిజాలు, పర్యావరణం రక్షించుకోవడం ప్రజల హక్కు వీటిని రక్షించుకోవడానికి మైనింగ్ మాఫియా ఆగడాలను అరికట్టడానికి జుడిషియల్ ఎంక్వయిరీ వేయాలి. రెవిన్యూ శాఖ చూసి చూడనట్లు వ్యవహరించడం గనుల శాఖలో కొంతమంది అధికారులు గనులమాఫియాకు సహకరించడం దోషులకు కఠినంగా శిక్షలు లేకపోవడం, నేటికీ గనుల మాఫియా యదేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. గ్రావెల్ తవ్వకాలు, మైనింగ్ మాఫియా పై గళం విప్పుతున్న, ప్రజాసంఘాలు, ప్రజలను, సామాజిక కార్యకర్తలను బెదిరించి కేసులు పెట్టడం. గ్రావెల్ తవ్వకాలపై కథనాలు రాస్తున్న విలేకరులపై బెదిరింపులు, దాడులు పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము ఖండిస్తున్నాం. అనుమతి ఉన్న అనుమతి లేని అన్ని గనులను విజిలెన్స్ ఎంక్వయిరీ వేసి ప్రభుత్వ ధనాన్ని జరిమానా రూపంలో వసూలు చేయాలని అని జనసేన డిమాండ్ చేస్తుంది.