రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకి అండగా ఉంటామని, అలాగే మా అధ్యక్షుల వారు చెప్పినట్టు అమరావతి కోసం న్యాయపోరాటానికి కూడా సిద్దమే అని వత్సవాయి మండల నాయకులు కొర్రపాటి గోపీచంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ఈమని కిషోర్ కుమార్ పాల్గొని జనసేన పార్టీ తరుపున పత్రిక ముఖంగా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఒకప్పుడు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉంది అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపి, అమరావతిలో ఇల్లు కట్టుకుని ఈ రోజు మూడు రాజధానుల పేరుతో అటు ఉత్తరాంధ్ర ప్రజలని ఇటు రాయలసీమ ప్రజలని మభ్యపెడుతున్నారని తెలిపారు. అమరావతి పట్ల మీకు ఈ మాత్రం చిత్తశుద్ధి ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబందించిన వైసీపీ ప్రజాప్రతినిధులు అలాగే టీడీపీ ఎమ్మెల్యే లు రాజీనామాలు చేసి ప్రత్యక్ష పోరాటంలోకి రావాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగరాజు, చారి, నవీన్, రెహ్మాన్, గోపి, నరేష్ తదితరులు పాలగన్నారు