గుంతకల్ పట్టణం ( జనస్వరం ) : వాల్మీకి నగర్, కసాపురం రోడ్డు, రైల్వే బ్రిడ్జి దగ్గర గల శ్రీ మకర లింగేశ్వర స్వామి దేవాలయం పునర్ నిర్వహణ సందర్భంగా ఆలయ పూజారి శ్రీ తేజ స్వామి మరియు వాల్మీకి నగర్ యువత, రాడ్ బెండర్స్ యూనియన్ మరియు బేల్దారి మేస్త్రి యూనియన్ వారి ఆత్మీయ ఆహ్వానం మేరకు స్వామివారిని దర్శించుకుని, మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ గారు... అనంతరం వాల్మీకి నగర్ యువత జనసేన నాయకులను ఘనంగా సత్కరించారు... ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీ పవర్ శేఖర్, శ్రీ ఎస్ కృష్ణ సీనియర్ నాయకులు శ్రీ కసాపురం నందా, శ్రీ సుబ్బయ్య, శ్రీ ఆటో రామకృష్ణ, శ్రీ కత్తుల వీధి అంజి,శ్రీ అఖిల్ రాయల్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ మంజునాథ్, శ్రీ పరశు, శ్రీ సూరి, శ్రీ రానా మరియు వాల్మీకి నగర్ యువత, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com