నరసాపురం ( జనస్వరం ) : మాజీ హోం శాఖ మంత్రి, పార్లమెంట్ సభ్యులు మరియు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు చేగొండి హరి రామ జోగయ్య ని పాలకొల్లులోని ఆయన స్వగృహం నందు గుంతకల్లు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ కలిశారు... ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ గారు మాట్లాడుతూ రాజకీయ కురువృద్ధుడైన పెద్దలు జోగయ్య గారితో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించి, ఆయనతో సలహాలు సూచనలు తీసుకొన్నామన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ సర్కార్ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనార్టీ వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని వారందరికీ న్యాయం చేయగల నిస్వార్థ నాయకుడు జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను యువత ముందుకు తీసుకువెళ్లాలని ప్రస్తుత రాజకీయాల్లో యువత ఆవశ్యకత చాలా ఉందని వారి ఆంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే అని అన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న యువత ఆయన బాటలో పయనించాలని రాబోయే రోజుల్లో జనసేన - టిడిపి పార్టీల విజయానికి నిస్వార్ధంగా కృషి చేయాలని జోగయ్య గారు దిశాద్దేశం చేశారని వాసగిరి మణికంఠ గారు పేర్కొన్నారు...
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com