
గుంతకల్ ( జనస్వరం ) : కసాపురం గ్రామం, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సత్తి కొన్ని రోజుల క్రితం నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కర్నూల్ హాస్పిటల్ నందు సర్జరీ చేయించుకుని అనంతరం ఇంటికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ వారి ఇంటికి వెళ్లి తనను వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఏ ఆపద వచ్చిన జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పరామర్శించిన వారిలో జనసేన జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్, సీనియర్ నాయకులు సుబ్బయ్య, మల్లికార్జున, కత్తుల వీధి అంజి, అమర్, అనిల్ కుమార్, శ్రీకృష్ణ, లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.