Logo
Date of Publish : 23 June 2026, 7:08 pm
Editor : Sake Naresh

గాయపడిన జనసైనికుడికి ఆర్థిక సాయం చేసిన వాసగిరి మణికంఠ

గుత్తి, జూన్ 18 (జనస్వరం): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న జనసేన పార్టీ కార్యకర్త షేక్షావలిని గుంతకల్ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడిన షేక్షావలి స్వగృహానికి వెళ్లిన మణికంఠ, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం తన వంతు సహాయంగా రూ.5,000 నగదు అందజేసి, భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్తకు జనసేన కుటుంబం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. కార్యకర్తల సంక్షేమం పార్టీ ప్రాధాన్యతల్లో ఒకటని పేర్కొన్నారు. అనంతరం గుత్తి పట్టణంలోని టమోటా స్ట్రీట్ ప్రాంత ప్రజలతో సమావేశమై స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుంతకల్ ఎమ్మెల్యే జయరాం సహకారంతో త్వరలోనే పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్, బోయగడ్డ బ్రహ్మయ్య, గోరంట్ల నాగయ్య రాయల్, వీరమహిళ కవిత, ధనంజయ, ఆముదాల రమేష్, తపిల వెంకటేశు, హరికృష్ణ, ఖాజా, శ్రీకాంత్, సయ్యద్, చిరంజీవి యువత గుంతకల్ నియోజకవర్గ అధ్యక్షుడు పాండు కుమార్, సుంకర నాగరాజు, సుబ్బయ్య, ముద్దులాపురం ప్రసాద్, అమర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com