Logo
Date of Publish : 07 January 2024, 7:23 pm
Editor : Sake Naresh

నాదెండ్ల మనోహర్ ను కలిసిన వాసగిరి మణికంఠ

    గుంతకల్ ( జనస్వరం ) : జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాద్యుడు వాసగిరి మణికంఠ.  ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ గారు నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి గుంతకల్ నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యల గురించి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పరిణామాలపై అలాగే జనసేన టిడిపి ఉమ్మడి కార్యాచరణపై  నాదెండ్ల మనోహర్ గారితో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పార్టీ బలోపేతం కోసం చేపట్టవలసిన కార్యక్రమాలపై అలాగే నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు అందరూ బలంగా పనిచేయాలని దిశ నిర్దేశాన్ని అందించడం జరిగిందన్నారు.  పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని వారి సేవలకు అనుగుణంగా పార్టీలో వారికి తగిన గుర్తింపు ప్రాధాన్యత ఉంటుందని నాయకుడు ఒక గొప్ప ఆశయం కోసం ముందుకు వెళుతున్న తరుణంలో నాయకులు కార్యకర్తలు అదినాయకుడి వెంట నిస్వార్ధంగా బలంగా నిలబడాలని బాధ్యతతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారన్నారు. నాదెండ్ల మనోహర్ గారి సూచనలు, సలహాలతో రెట్టించిన ఉత్సాహంతో మరింత బలంగా పనిచేస్తాం అని వాసగిరి మణికంఠ గారు పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com