
దర్శి, (జనస్వరం) : ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం, కురిచేడు మండలం, దేకనకొండ గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలకు నిరంతరం కృషి చేసిన జనసైనికుడు ఇటీవల బలవన్మరణం చెందిన కీర్తిశేషులు బెల్లం సురేష్ కుటుంబానికి జనసేన పార్టీ తరపున 40,000/- వేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు అందించడం జరిగింది. దర్శి నియోజకవర్గంలోని జనసైనికులు అండగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళుతున్న వరికూటి నాగరాజు ఈరోజు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాలతో కూడా ఇటీవల మరణించిన బెల్లం సురేష్ కుటుంబానికి అండగా ఉండాలని వారి కుటుంబానికి 40,000/- వేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని కీర్తిశేషులు బెల్లం సురేష్ సతీమణి వాణికి అందించి వారి ఇద్దరి కుమారులకు నోట్ బుక్స్, స్టేషనరీ, బ్యాగ్స్ ను గ్రామ జనసైనికులు సమక్షంలో వారి కుటుంబానికి అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో దర్శి పట్టణ జనసేన నాయకులు షేక్. ఇర్షాద్, వరికూటి అనిల్, నీలిశెట్టి ప్రభు, మారెడ్డి పవన్, అరవింద్, పుప్పాల నరేంద్ర, పసుపులేటి సాయి, బెల్లం రవి, మర్రి వంశీ, వేమా ప్రసాద్, వేమా సుబ్బారావు, గ్రామ జనసైనికులు పాల్గొనడం జరిగినది.