Logo
Date of Publish : 12 June 2023, 4:05 pm
Editor : Sake Naresh

వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది

    ఏలూరు ( జనస్వరం ) : వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులకు నాంది పలుకుతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల జనసేన పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు అన్నారు.. ఈరోజు ఏలూరు పవర్ పేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో వారాహి యాత్ర పోస్టర్ ను ఆయన సీనియర్ నాయకుడు బి.వి. రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన నాయకులతో కలసి ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఈనెల 14 వ తేదీ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని దర్శనం అనంతరం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కత్తిపూడి నుండి యాత్రను ప్రారంభిస్తారన్నారు.. ఈ యాత్ర కేవలం ఎన్నికల కోసమే కాదని, ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా యాత్ర కొనసాగుతుందన్నారు.. వైసిపి ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితి నుండి గట్టెక్కడానికి జనసేన పార్టీ పరిపాలన రావాలని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్న తరుణంలో ఈ వారాహి యాత్ర ప్రాధాన్యతను సంతరించుకుంటుందన్నారు.. రాష్ట్ర పరిపాలన విధానంలో ఖచ్చితమైనజవాబుదారీతనం, ఒక జనసేన పార్టీకే సాధ్యమవుతుందన్నారు.. రానున్న రోజులలో జనసేన పార్టీ సిద్ధాంతాలను నియోజకవర్గాల వ్యాప్తంగా, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, తీసుకువెళ్లి, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా వారాహి యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా,నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, కార్యదర్శి బొత్స కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, కుర్మా సరళ, నాయకులు వీరంకిపండు, బోండా రాము నాయుడు,దుర్గారావు,హరీష్, నాగభూణం కుమార్,పొన్నూరు రాము, తేజప్రవీన్, 1 టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోలా సుజాత, 2 టౌన్ మహిళ సెక్రటరీ తుమ్మపాల ఉమా దుర్గ, కే ప్రమీల రాణి,దుర్గ బి, తదితరులు పాల్గొన్నారు..


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com