గుంతకల్లు, (జనస్వరం) : జనహితంకోరే జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్న “వారాహి యాత్ర” విజయవంతం కావాలని అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణం, హనుమాన్ సర్కిల్ నందు గల అభయాంజనేయ స్వామి పాదాల చెంత ప్రత్యేక పూజా కార్యక్రమం 101 టెంకాయల సమర్పణ కార్యక్రమం నిస్వార్థ జనసైనికుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం, ఓ నూతన అధ్యాయ నిర్మాణం కోసం, ప్రజా సమస్యలపై బలమైన పోరాటం చేసేందుకు వారాహి యాత్రను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈనెల 14వ తారీకు నుండి అన్నవరం సత్యదేవుడి దర్శనం అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించబోతున్నారు. కేవలం ఎన్నికల కోసమే ఈ యాత్ర కాదు, ప్రజల బాధలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వారితో మమేకమైనందుకు, ఇదో చరిత్రలో నిలిచిపోయే యాత్ర కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అనిచ్చితి పరిస్థితుల నుండి గట్టెక్కాలంటే జనసేన పాలన రావాల్సిందే అని ఆశాభావంతో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇంకా అనేక వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి గానే ఆత్మహత్య చేసుకున్న వేలాది మంది కౌలు రైతు కుటుంబాలకు ఆపన్నహస్తం అందిస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ప్రజలు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే శక్తిని అందజేస్తే ఇంకెంతో మందికి ఉపయోగకరమైన సేవలు అందిస్తారనే భావన ప్రజల్లో బలంగా నాటుకుందని. ప్రజాధనం ధనం ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా, అప్పులను అదుపు చేస్తూ, అభివృద్ధి బాటలు వేయగల సమర్థ నిజాయితీ నాయకుడు పవన్ కళ్యాణ్ అనే భావన ప్రజల్లో బలంగా ఉందని. రాష్ట్ర పరిపాలన విధానాల్లో ఖచ్చితమైన జవాబిదారితనం జనసేనతో మాత్రమే సాధ్యమవుతుందని ప్రజల అభిప్రాయ పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ పట్టణ, మండల అధ్యక్షులు బండి శేఖర్, కురువ పురుషోత్తం జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్, ఎస్.కృష్ణ గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, సీనియర్ నాయకులు పూల ఎర్రి స్వామి, రాంబో టైలర్ వీర, గాజుల రఘు, కసాపురం సుబ్బయ్య, దాదు,మోహన్, అఖిల్, మోహన్ రాయల్, గంగాధర్, ముత్తు, అమర్, రామకృష్ణ, మారుతి యాదవ్, చికెన్ మధు, శ్రీనివాసులు, మహేష్, సూర్యనారాయణ, అనిల్ కుమార్ జనసైనికులు కసాపురం రాము, చిట్టి, కాశీ కుమార్, చిన్న బాబు, సమీర్, వీరేష్, బర్మశాల సీను, చంద్ర, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com