విశాఖపట్నం ( జనస్వరం ) : ఈనెల 14న అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన అభిమానులు జన సైనికులు పెద్ద ఎత్తున సంబరాలతో పాటు ప్రత్యేక పూజపు జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా విశాఖలోని దక్షిణ నియోజకవర్గం నాయకులు 32 వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 108 కొబ్బరికాయలు కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక ప్రచార రధం ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుల నాగరాజు మాట్లాడుతూ జనసేన క్యాడర్ ని బలపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్నో సమస్యలను ప్రజల ద్వారా నేరుగా తెలుసుకునేందుకు జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించినున్నారని నాగరాజు తెలిపారు... యాత్ర సంబంధించి ఎటువంటి ఆటంకాలు అశుభాలు ఎదురుకాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కొబ్బరికాయలు కొట్టి ప్రచార రధం ప్రారంభించినట్టు తెలిపారు. వారాహి యాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు రావడం ఖాయమని జోశ్యం చెప్పారు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన రాష్ట్ర ప్రజలు జనసేనకు ఓటు వేసి జనసేన పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని నాగరాజు తెలిపారు వారాహి యాత్రకు సంఘీభావంగా పవనన్న బాట పేరుతో తాను కూడా దక్షిణ నియోజకవర్గంలో పర్యటన చేపడతామన్నారు. కార్యక్రమంలో దక్షిణ నియోజవర్గం సీనియర్ నాయకులు హరికృష్ణ, అరుణ, యజ్ఞశ్రీ, అంతోని, త్రినాధ్, రఘు, ప్రణీత్, ఎర్రంశెట్టి సురేష్, రాజు, గణేష్, అప్పారావు, గాజులు శ్రీను, సంతోష్,సన్నీ,రాజేష్,లలిత,మంగ వేణి, సునీత, కుమారి, దుర్గ, ఝాన్సీ, హేమలత, అలేఖ్య, జానకి,కృష్ణ,శ్రీను,నాయుడు, మనీ, రాజు, రాధాకృష్ణ, హరి, ప్రకాష్, రాము, సతీష్, బుజ్జి పెద్ద ఎత్తున జనసైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com