అనంతపురం ( జనస్వరం ) : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తెలుగు మరియు తులనాత్మక సాహిత్య శాఖ విభాగాధిపతి ఆచార్య ఎన్.ఆర్. సదాశివరెడ్డి పర్యవేక్షణలో “ఆంధ్ర మహాభారతం – వర్ణ వ్యవస్థ” అనే అంశంపై పరిశోధించిన వంకం భాస్కర్ కు పిహెచ్డీ పట్టాను ప్రదానం చేశారు. భారతదేశంలో వర్ణవ్యవస్థ ఎలాంటి ప్రభావాన్ని చూపుతోంది అన్న అంశాన్ని ఆంధ్ర మహాభారతం ఆధారంగా విశ్లేషించి ప్రాచీన సమాజంలో ప్రారంభంలో వర్ణవ్యవస్థ లేదని, ఇది మధ్యలో వచ్చిందని సహేతుకంగా వివరించారు. ఈయన ప్రాచీన సాహిత్యంపై లోతైన అధ్యయనం చేస్తూ, జాతీయ స్థాయిలో పలు పరిశోధనా పత్రాలను సమర్పించారు. వంకం భాస్కర్ కు పీహెచ్డీ డాక్టరేట్ రావడం పట్ల డా. బత్తల అశోక్ కుమార్ హర్షం వ్యక్తంచేశారు. తెలుగు విభాగం సిబ్బంది, పరిశోధకులు ప్రత్యేకంగా అభినందించారు.