విజయవాడ, (జనస్వరం) : వంగవీటి మోహన్ రంగా 75వ జయంతి కార్యక్రమాల్లో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. బందర్ రోడ్ వంగవీటి రాధా కృష్ణతో కలిసి రంగా కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ విప్లవం నా హక్కని అల్లూరి సీతారామరాజు నినాధించినట్ల, పోరాటం నా ఊపిరి అని నినాదం ఇచ్చిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని కొనియాడారు. పేద, సామాన్య వర్గాల హక్కుల కోసం అభివృద్ధి కోసం నిరంతరం పోరాడారని తెలియజేశారు. చిన్న జిల్లాల ఏర్పాటులో భాగంగా రంగా పేరుని ఒక జిల్లాకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్రవ్యాప్తంగా రంగా అభిమానులు కోరితే ఆ డిమాండ్ ను జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని తెలిపారు. వైసీపీలో ఉన్న నాయకులు ఈ డిమాండ్ ను జగన్ తో ఒప్పించడంలో వైఫల్యం చెందారని అందువల్ల వారికి రంగాకి నివాళులర్పించిన అర్హత లేదన్నారు. రాబోయే రోజుల్లో రంగా ఆశయ సాధన కోసం రాధా రంగా మిత్రమండలి, రాధా కృష్ణ అభిమానులు బలంగా పని చేయాలని, రాబోయే రోజుల్లో రాధాకృష్ణ ఏ పిలుపు యిస్తే ఆ పిలుపుకు అనుగుణంగా అందరూ కలసికట్టుగా పనిచేయాలని తెలియజేశారు. మొదటిగా పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్ అధ్యక్షులు మల్లె విజయలక్ష్మి ఆధ్వర్యంలో విద్యాధరపురం, చెరువు సెంటర్లో వంగవీటి మోహన రంగా విగ్రహానికి బొమ్ము. రాంబాబు, పొట్నూరు శ్రీనివాసరావు, నల్లబెల్లి కనకరావు, కాపు.వడ్డీ వెంకట్, కార్తిక్, అనంత్, స్టాలిన్ శంకర్ లతో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు వందల మందికి స్వీట్లు మామిడి పండ్లు పంపిణీ చేశారు. అలాగే వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలో పోలిశెట్టి శివ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి మైలవరపు కొండలరావు, నల్లబెల్లి కనకారావు, పల్లంటి.గంగాధర్, అంజిబాబు, గణప.రాము, వెన్న శివశంకర్, తోతడి భరత్, కొరగంజి రమణ, తమ్మిన రఘు, మూర్తి తదితరులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం విద్యార్థులకు పలకలు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు. తదనంతరం భవానిపురం కుమ్మరిపాలెం సెంటర్ వద్ద ఏలూరు సాయి శర్మ ఆధ్వర్యంలో రంగా చిత్రపటానికి తమ్మిన.లీలా కర్ణాకర్, కంది రాజా, తోట.కోటి, స్టాలిన్ శంకర్ మల్లెపువ్వు విజయలక్ష్మి తదితరులతో కలిసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి పేదలకు స్వీట్లు పంపిణీ చేశారు.