Logo
Date of Publish : 26 December 2025, 3:41 pm
Editor : Sake Naresh

వంగవీటి మోహన రంగా ఆశయాలే ఎన్డీయే కూటమికి మార్గదర్శకం – కర్ణ అమర సైదారావు

వంగవీటి మోహన రంగా ఆశయాలే ఎన్డీఏ కూటమికి మార్గదర్శకం — కర్ణా అమర సైదారావు

కారంపూడి.డిసెంబర్26 (జనస్వరం)

ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన ప్రజానాయకుడు, దళిత బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి సందర్భంగా కారంపూడి బస్స్టాండ్ సెంటర్‌లోని ఆయన విగ్రహం వద్ద ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముందుగా వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. అనంతరం అభిమానుల చేతుల మీదుగా పులిహోర పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు కర్ణ అమర సైదారావు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా ప్రజాస్వామ్య విలువలకు, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన నాయకుడని పేర్కొన్నారు. అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిన అరుదైన నాయకుడు రంగా అని గుర్తు చేశారు.ప్రజల సమస్యలపై రాజీపడని పోరాట తత్వమే రంగా అసలైన గుర్తింపని, అటువంటి పోరాట స్పూర్తినే నేడు ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రంగా చేసిన త్యాగం నేటి రాజకీయాలకు మార్గదర్శకమని చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో విలువలు క్షీణిస్తున్న సమయంలో రంగా ఆశయాలను స్మరించుకోవడం మాత్రమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిపై ఉందని అమర సైదరావు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బూసా రామాంజనేయులు, శెట్టి హనుమంతరావు,తోట అల్లయ్య,తోట రంగారావు కోరే శ్రీను,తెలగనేని లక్ష్మయ్య, సంగీనేడి బాలకృష్ణ, శ్రీను మిరియాల అశోక్,మొఖ మాటo శివబాబు, బండారు వీరేశ్వర రావు,ఎస్ఎంకె నాయుడు,తోట శ్రీను చలువాది సాయి,చింతపల్లి రామ్మూర్తి,వెంకటేశు, పెనుగొండ వెంకటేశు,కిల్లా చెన్నయ్య,కోనేటి కోటేశ్వర రావు,సారధి,కర్ణ వెంకటేశ్వర్లు, కిల్ల భాస్కర్,ఎన్డీఏ కూటమి నాయకులు,కార్యకర్తలు,రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్ధంతి వేడుకలను విజయవంతం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com