ఎమ్మెల్యే కనుసన్నుల్లోనే అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణ చేసిన తెలంగాణ జనసేన నాయకులు వంగ లక్ష్మణ గౌడ్

లక్ష్మణ గౌడ్

                   నాగర్ కర్నూల్ జిల్లాలో టి‌ఆర్‌ఎస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే కనుసన్నుల్లోనే భూ అక్రమాలకు పాల్పడుతున్నారని, పేదల భూములను ఆక్రమించుకోవాలని చూస్తే సహించేది లేదని  జనసేన పార్టీ యూత్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగ లక్ష్మణ్‌ గౌడ్‌ గారు అన్నారు.  నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం పరిదిలోని తాడూరు. మండల కేంద్రం శివారులో పేదల భూములను అక్రమించి డబుల్‌ బెడ్రూం నిర్మాణాల కోసం జెసిబితో చదును చేయించిన ప్రదేశాన్ని ఆయన బాధితులతో కలిసి పరిశీలించారు. స్థానిక సర్పంచ్‌ భర్త నాగర్‌కర్నూల్‌కి చెందిన రియల్‌ మాఫియాతో చేతులు కలిపి డబుల్‌ బెడ్ రూ౦ నిర్మాణాల పేరుతో మా భూములను లాక్కుంటున్నారని బాధితులు లక్ష్మణ్ గౌడ్ కు వివరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ గారు మాట్లాడుతూ గ్రామ శివారులో రైతు లక్ష్మయ్యతో పాటు మరి కొంత మంది రైతులకు 601 సర్వే నెంబర్‌లో లావణి పట్టా భూమి ఉందని, ఇందులో 60 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిన్తున్నారన్నారు.. రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్పంచ్‌ భర్త జేసీబీతో పంట పొలాలను చదును చేశాడన్నారు. గతంలో డబుల్‌ బెడ్రూం ఇండ్లు రైతు వేదిక పక్కల నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారన్నారు. కేవలం రియల్‌ మాఫియా కోసం పేదలు సాగు చేసుకుంటున్న భూములను డబల్‌ టెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం పేరుతో లాక్కోవాలని చూస్తు న్నారన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి క్యాంప్‌ కార్యాల యానికి కూత వేటు దూరంలోనే ఈ తతంగమంతా జరుగుతున్నా ఆయన స్పందించక పోవడం దారుణమని అన్నారు. దీనిని బట్టి రియల్‌ మాఫియా వెనక ఎమ్మెల్యే హస్తం ఉందని ఆయన ఆరోపించారు. అదే ప్రదేశంలో బడాబాబులకు చెందిన ప్రభుత్వ భూమి ఉన్నా దాని వైపు కన్నెతి చూడకుండా పేదల భూములు లాక్కోకోవడం ఎంత వరకు సమంజ సమన్నారు. డబుల్‌ బెడ్రూం ఇండ్ల కోసం ప్రతిపాదనలు పంపిన స్థలం కాకుండా మరో చోటుకు మార్చడంపై ఆంతర్యమేమిటో చెప్పాలని సర్పంచ్‌ని ప్రశ్నించారు… రైతులకు అండగా జనసేన పార్టీ ఉంటుందని వారి భూముల్లో డబల్‌ బెడ్‌ రూమ్‌ పేరిట ప్రజా ప్రతినిధులు ఎటువంటి కార్యకమాలు చేపట్టినా రైతు పక్షాన నిలబడి అడ్డుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way