విశాఖపట్నం ( జనస్వరం ) : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా జనసేన సిద్ధాంతాలకు స్ఫూర్తి పొందిన కొంత మంది యువకులు కిరణ్ కుమార్ దేవరాజ, బేరి దుర్గా రావు, ఇంద్రజిత్ సింగ్ సర్దార్, శరణ్ భరద్వాజ్, మరియు తదితరులు ఏర్పరచిన టీం రాజకీయం తరపున విశాఖలో వనమహోత్సవం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పర్యావరణం, అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి పారుదల శాఖ మాత్యులుగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని విశాఖ పశ్చిమలో పారిశ్రామిక ప్రాంతమైన నౌసేన బాగ్ – సింధియా మధ్య కిలోమీటరున్నర మేర రోడ్డు మధ్యన డివైడర్ పై వెయ్యికి పైగా మొక్కలు టీం రాజకీయం సభ్యులు కడియం నర్సరీ నుండి తెప్పించి నాటడం జరిగింది.. నాటిన పిమ్మట మూడేళ్ళ పాటు, ఆ మొక్కల నిర్వహణ బాధ్యతలు వీరే చేపట్టనున్నట్టు తెలిపారు. 62 వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు ఇంద్రజిత్ టీం రాజకీయం తరపున మీడియాతో మాట్లాడుతూ ఈ వనమహోత్సవ కార్యక్రమానికి సహకరించిన జీవీఎంసీ అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమం చేపట్టినప్పటి నుండి కమీషనర్, అడిషనల్ కమీషనర్ మంచి సహకారం అందించారని తెలిపారు. జీవీఎంసీ డైరెక్టరీ హార్టికల్చర్ విభాగం మూల దామోదర్ తన స్థాయికి మించి ఈ కార్యక్రమానికి సహకరించి అధికారుల నుండి అనుమతులు వచ్చేలా చేశారని కొనియాడారు. అలాగే జనసేన జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 33వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి బీశెట్టి వసంతలక్షి ఈ వనమహోత్సవ కార్యక్రమానికి ఒక మూల స్తంభంగా అభివర్ణించారు. సకాలంలో జీవీఎంసీ అధికారులతో మాట్లాడి ఈ కార్యక్రమం సజావుగా సాగేలా చూశారని చెప్పారు. అలానే ఎప్పుడు ఏమడిగిన కాదననకుండా తన సహాయ సహకారాలు అందించిన పీలా రామకృష్ణకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జనసేన సిద్ధాంతాలకు స్ఫూర్తి పొందిన ఈ యువకులతో పనిచేయడం చాలా సంతోషకరం అని అన్నారు.
ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని 3 నెలల ముందు గానే ప్లాన్ చేసి బాగా డిజైన్ చేసి ఈ రోజు అమలు పరిచి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించిన టీం రాజకీయానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. అలాగే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంతంలో విపరీతమైన కాలుష్య నివారణకు ఈ వనమహోత్సవం బాగా ఉపయోగపడుతుందన్నారు. నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ శాసన సభ్యులు వంశీ కృష్ణ యాదవ్, జీవీఎంసీ కమీషనర్ సంపత్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివ శంకర్, తెదేపా శాసన సభ్యులు పి గణబాబు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక జనసేన నాయకులు పీలా రామకృష్ణ, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 33 వ కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్షి, అడిషనల్ కమీషనర్ శ్రీనివాస్, జీవీఎంసీ డీ.డీ.ఓ.హెచ్ దామోదర్, జోనల్ డీ.డి.ఓ.హెచ్ అర్చన, మల్కాపురం సీఐ, చంద్రమౌళి, పశ్చిమ నియోజకవర్గం నాయకులు, వార్డ్ ప్రెసిడెంట్లు కోట శ్రీనివాస్, ముప్పిన ధర్మేంద్ర, పిల్ల సాయిరాం, శివశంకర్, దుంగా దేవంరాజ్, వీర మహిళలు అనురాధ, శంకరమ్మ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.