అనంతపురం ( జనస్వరం ) : ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు రాయలసీమ రీజినల్ ఉమెన్ కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ 24 వేల శ్లోకాలు ఏడు కాండములతో మానవాళికి రామాయణం అనే అద్భుతమైన మహాకావ్యాన్ని అందించిన గొప్ప వ్యక్తి ఆదికవి వాల్మీకి మహర్షి అని కొనియాడారు. అదేవిధంగా వాల్మీకుల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ మన రాష్ర్టంలోని శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం ,ఈస్ట్ గోదావరి ,వెస్ట్ గోదావరి ఈ ఉమ్మడి జిల్లాలలో వెనుకబడిన వాల్మీకి కులస్తులు ఎస్టీలుగా పరిగణించబడుతున్నారని కానీ మన రాయలసీమ లోని ఉమ్మడి నాలుగు జిల్లాలలో వాల్మీకులు ఎస్టీ రిజర్వేషన్లు లేక చాలా వెనుకపాటు తనానికి గురవుతున్నారని అధికారంలోకి వచ్చేకి మాత్రమే ఇతరపార్టీలు వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేరుస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాల్మీకి కులస్తులను విస్మరిస్తున్నారని ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి కూడా 2019 ఎన్నికల వాగ్దానాలలో వాల్నికులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి వాల్మికుల ఓట్లతో ఆధికారంలోకి వచ్చి వారి రిజర్వేషన్ల విషయాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు పట్టించుకోకుండ తీర ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాల్మికుల మీద దొంగ ప్రేమ చూపిస్తూ వారి ఓట్లకోసం, సానుభూతి కోసం అసెంబ్లిలో అసంపూర్ణమైన తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేశామని చెప్పి ఈ జగన్ రెడ్డి వాల్మికుల ఎస్టీల రిజర్వేషన్ల విశయంలో చేతులు దులుపుకొని వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్లు అందని ద్రాక్షలా తయారు చేసాడని హామీలు ఇవ్వడం చేతులు దులుపు కోవడం ఈ జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యని రిజర్వేషన్లు ఎది ఏమైనా జనసేన , టీడీపీ ఉమ్మడి పార్టీలు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని పోయిన సభలలో కూడా మా అధ్యక్షులు వారు వాల్మీకి కులస్తులు రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నారని వారు వెనుకబాటుకు గురవుతున్నారు వారిని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తాం అన్నారని తెలియజేశారు. పేరుకే వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఈ కార్పొరేషన్ ద్వారా వాల్మికులకు ఏమాత్రం మేలు జరగడం లేదని ఇటు వాల్మికులను ఎస్టీ జాబితాలో చేర్చక వారి కార్పొరేషన్ కి సరైన నిధులు ఇవ్వక వారు దుర్భరమైన జీవితం కొనసాగిస్తున్నరని అన్నారు ఈ కార్యక్రమంలో వీర మహిళలు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com