- దళితుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు...
- సర్పంచ్ కు న్యాయం చేయాలి...
- వల్లూరు గ్రామస్తులు ఆందోళన...
- ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై ఎస్.సి, ఎస్.టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్...
కపీలేశ్వపురం (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా వల్లూరులో పింఛన్లు పంపిణీ సమయంలో జనసేనపార్టీ సర్పంచ్ దాసి మీనా కుమారి గారిని దళిత మహిళ అని చూడకుండా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మరియు అనుచరులు దుర్భాషలాడి, దాడికి పాల్పడ్డారని వల్లూరు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సర్పంచ్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసును తప్పుదారి పట్టించే విధంగా సర్పంచ్ ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా పోలీసులు తప్పుడు పిర్యాదు సృష్టించి వేరే కేసు నమోదు చేసి సరికొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. తక్షణమే మీనాకుమారి గారు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, మండపేట నియోజకవర్గ ఇంఛార్జ్ లీలాకృష్ణ గారిపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి సరాకుల అబ్బులు గారు మాట్లాడుతూ మా దళిత మహిళ సర్పంచ్ దాసి మీనకుమారి గారికి న్యాయం జరిగే వరకూ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com