కదిరి ( జనస్వరం ) : శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సంబందించిన గోవులను కొంతమంది అనుమతి లేకుండా ఆలయంలో పనిచేసే వ్యక్తుల పేరు చెప్పి అక్రమంగా తరలిస్తున్నారని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ రవాణాను అడ్డుకున్న స్థానికులపై నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడడం జరిగింది. అంతే కాకుండా అధికారుల పేరు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు. ఇదే విషయమై ఆలయ కార్య నిర్వహణ అధికారికి తెలియజేస్తే మేము ఎవరికీ ఏటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ఇదే విషయంపై కదిరి పట్టణంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, విశ్వ హిందు పరిషత్, జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్ కలిసి ఆలయ ఈవో కి వినతి పత్రం అందించడం జరిగింది. ఆలయ E.O కూడా స్పందించి ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భక్తులు తమ భక్తి ప్రపత్తులతో స్వామి వారికి గోవులను వదిలి వెళ్ళడం జరుగుతోందని అటువంటి గోవులను పరిరక్షించాల్సిన అధికారులు వాటి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గతంలోనే గోశాలని ఏర్పాటు చేసి కదిరి పట్టణంలో ఉన్న గోవులను గోశాలకు తరలించి రక్షించాలని, ఎందుకంటే నిత్యం గోవులు పట్టణంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలకు గురి అయ్యి చనిపోతున్నాయని, తెలియని వింత రోగాలతో మరణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు నంది శెట్టి బాబు, బీజేపీ పార్టీ కదిరి పట్టణ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర నాయుడు, విశ్వ హిందు పరిషత్ నాయకులు మనోహర్ రెడ్డి, జనసేన పార్టీ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, ఐటి వింగ్ కోఆర్డినేటర్ రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నాయకులు రవీంద్ర, అంజిబాబు, రవి కుమార్, మిథున్, చిన్నా, అరవింద్, మహేష్ తదితర జనసైనికులు, బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.