అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా 48వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 42వ డివిజన్ లో పర్యటించి మహిళలతో మమేకమై డివిజన్ సమస్యలు తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ అవినీతి అక్రమ పాలన అంతమయ్యేందుకు రోజులు దగ్గర పడ్డాయని జగన్ పాలనపై అన్ని వర్గాలు విసిగిపోయాయని ప్రజలు ఈ విషయాలన్నీ గమనించి జనసేన టీడీపీ బీజేపీ పార్టీలను ఆశీర్వదించాలని రాష్టానికి అభివృద్ధి పథం వైపు నడిపించే బాధ్యత బిజెపి కేంద్ర ప్రభుత్వ సహకారంతో జనసేన తెలుగుదేశం పార్టీలు బాధ్యత తీసుకుంటాయని అన్నారు. ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోలోని ప్రధానమైన విషయాలను ప్రజలకు వివరించారు. వీటితో పాటు స్థానిక డివిజన్ లో మంచినీటి సమస్య , మురుగుకాలువాల సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com