Logo
Date of Publish : 21 January 2024, 7:17 pm
Editor : Sake Naresh

పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైకాపా ప్రభుత్వం

   అనంతపురం ( జనస్వరం ) : అర్బన్ నియోజకవర్గం లోని 14వ డివిజన్ లో జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి పలు సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక డివిజన్ లో నివాసముండే జాఫర్ మెహిద్దిన్ సాబిరాబి దంపతులు టిడ్కో గృహాలకై 25వేళ రూపాయలు చెల్లించి ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి దగ్గరకి స్థానిక కార్పొరేటర్ అబుసాలెం దగ్గరకు పలుమార్లు తిరిగిన స్పందించలేదని అన్నారు. అందుకు వీరు తమవద్ద వారి గోడును వెలిబుచ్చుకుంటు మేము నగరంలో ప్రస్తుతం ఉన్న ధరలలో ఇళ్ళకి బాడుగలు కట్టలేకున్నామని మాకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారాన్నరని అంటున్నారు. గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఈ వైకాపా ప్రభుత్వం టిడ్కో గృహాలను నిరుపేద ప్రజలకు పంపిణీ చేయకుండా జగనన్న గృహాల పేరుతో మరో మోసానికి తెర తీశారని అన్నారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం సమయం ముగుస్తున్న ఇప్పటికీ ఎవి పూర్తి చేయక ప్రజలను మభ్య పెట్టారని.. వీటితోపాటు ఇక్కడ మంచినీటికి అరకొర పైపు లైను లు వేసి నీటి సరఫరాను ఇప్పటి వరకు వీరికి అందించలేదన్నారు. ప్రజలు ఈవిషయాలన్ని గ్రహించి జనసేన టీడీపీ పార్టీలకు ఓటు వేసి ప్రజా ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలని వెంటనే టిడ్కో గృహాల పంపినితో పాటు పలు ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com