అనంతపురం ( జనస్వరం ) : ప్రభుత్వం సరైన సమయంలో జీతాలు చెల్లించక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగి మల్లేష్ నీ ప్రభుత్వ సర్వజన వైద్యశాలకి వెళ్లి పరామర్శించిన రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు చెల్లించడం లేదని వైకాపా ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన సిపీఎస్ రద్దు మొదలైన అనేక హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. ఈ విషయాన్నే మల్లేష్ కూడా లెటర్ లో రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సరైన సమయానికి రాక వారు తీసుకున్న ఈ.ఎం.ఐ లు ఇతర రుణాలు చెల్లించడం కష్టతరమయ్యి మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈ వైసీపీ ప్రభుత్వానికి రోజుల దగ్గర పడ్డాయని అన్ని వర్గాల ప్రజలను పట్టిపీడిస్తుందని తప్పకుండా ప్రజలు రాబోయే ఎన్నికలలో బుద్ది చెబుతారని అన్నారు. ఈకార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.