అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా 33వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం లోని స్థానిక 12వ డివిజన్ లో పర్యటించి మహిళలతో మమేకమయ్యి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి ఆర్థిక సంక్షేభంలో నెట్టాడని రాష్ట్ర వార్షిక ఆదాయం కంటే వార్షిక అప్పులే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఉద్యోగ ఉపాధి కల్పనకూడా ఏమి లేదని దీనికి తోడు పేద ప్రజలను వైకాపా ప్రభుత్వం పట్టించుకోకుండా జగన్ రెడ్డి సామాజిక వర్గానికే కొమ్ము కాస్తు నామినేటెడ్ పదవులతో పాటు ప్రభుత్వ కాంట్రాక్ట్ లు వారికే కేటాయిస్తున్నారని అన్నారు. జగన్ రెడ్డి సామాజిక సాధికారతను తుంగలో తొక్కరని బీసీ,ఎస్సీ,ఎస్టీ లకు సముచిత స్థానం జనసేన టీడీపీ పార్టీలే కల్పిస్తాయని కనుక అందరు ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు మీ ఓటు వేసి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com