కళ్యాణదుర్గం, ఏప్రిల్ 07 (జనస్వరం) : కళ్యాణదుర్గం నియోజకవర్గం టిడిపి+జనసేన+బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అధ్యక్షతన "వడ్డెర గర్జన" భారీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జనసేన+టీడీపీ వడ్డెర కార్యకర్తలు, వడ్డెర నాయకులు, వడ్డెర మహిళలు, వడ్డెర కులస్తులు, వడ్డెర సోదరులు, వడ్డెర అభిమానులు పాల్గొన్నారు. ఈ "వడ్డెర గర్జన" సమావేశంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ సూచనలతో జనసేన పార్టీ వడ్డెర నాయకులు నియోజకవర్గ జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ రాయుడు, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, కంబదూరు మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్, బెస్తరపల్లి అనిల్, బెస్తరపల్లి ప్రకాష్, బ్రహ్మసముద్రం వన్నూరుస్వామి పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com