Logo
Date of Publish : 01 November 2022, 4:13 pm
Editor : Sake Naresh

వైసీపీ కాపు నేతలపై విరుచుకుపడ్డ జనసేన నాయకులు వబ్బిన శ్రీకాంత్

           పెందుర్తి ( జనస్వరం ) : పెందుర్తి నియోజకవర్గం, 88 వార్డ్, నరవ గ్రామం జనసేన నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్  మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ కాపు నాయకులు అందరూ కలిసి కాకినాడలో మీటింగ్ ఏర్పాటు చేయాడని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ ప్రజాప్రతినిధులు కాపు కులస్తులకు ఏమి చేశాము వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జీవన సరళిలో ఏమైనా మార్పు వచ్చిందా అని వాటిపై చర్చించకుండా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వ అభివృద్ధి ఏ విధంగా అణచివేయాలి, ప్రజల నుండి జనసేన పార్టీని ఏ విధంగా దూరం చేయాలి అనే విషయాలు పై చర్చించడాని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టి 11 సంవత్సరాలు, అధికారం వచ్చి సుమారు మూడున్నర సంవత్సరాలు అవుతున్న ఎప్పుడు కాపు నాయకులు ఇటువంటి మీటింగ్ పెట్టలేదని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రజా ఆదరణ చూసి ఓర్వ లేక ఇటువంటి మీటింగ్ పెట్టడం అతిశయోక్తిగా ఉందని అన్నారు. సంవత్సరానికి 10,000 కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా కాపు ప్రజలకు అందిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం గడిచిన మూడున్నర సంవత్సరం కాలంలో ఎంతమందికి నిధులు మంజూరు చేసాం, కాపు నేస్తం ద్వారా ఎంతమంది కాపు మహిళల జీవనసరళిలో మార్పు వచ్చిందో, ఎంతమంది కాపు బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయో ఈ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. వంగవీటి మోహన్ రంగా గారిని ప్రజలు కోల్పోయారని, రంగా గారిని ప్రజల నుండి ఎవరు దూరం చేశారో ప్రజలకు తెలుసని, కాపులకు 10 శాతం రిజర్వేషన్ కావాలని అప్పటి ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు. ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని స్టీల్ ప్లాంట్ కోసం పెద్దన్న పాత్ర వహించి ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయండన్నారు. బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వద్దాం అని అడిగితే ఇప్పటివరకు ఎటువంటి కార్యచరణ చేయకుండా మూడు రాజధానులు అని చెప్పి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే ప్రజలు అవగాహనతో ప్రభుత్వ చర్యలను తిప్పి కొడుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం ఎంత దిగజారుడుగా ఆలోచిస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఉదాహరణ అని అన్నారు. 2024లో ప్రజలందరూ జనసేన పార్టీనీ ఆదరించడానికి సన్నద్ధులుగా ఉన్నారని, జనసేన పార్టీని స్థాపించి పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు, దనికులుకు ఒకే చట్టం అమలయ్యేలాగా పరిపాలన చేస్తామని, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అమలు చేయాలో చూపిస్తామని, జనసేన పార్టీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com