పథకాల పేర్లేమో ఆడంబరం పథకాల అమలు పేలవం, ఏ పధకం చూసినా ప్రలోభమే తప్ప ప్రయోజనం ఉండట్లేదు. కాపు సామాజిక వర్గం అందులోని ఉప కులాలకు చెందిన అల్పాదాయ, ఆర్ధికంగా వెనుకబడిన 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు మధ్య ఉన్న అర్హులైన మహిళలకు ఏడాదికి 15000/- రూపాయల ఆర్ధిక సహాయం అందించటం ఈ పథకం ఉద్దేశ్యం. అంటే 5 సంవత్సరాలు గడిచేలోగా 75000/- DBT (Direct Benifit Transfer) పద్దతిలో లబ్ధిదారులకు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో కులాలకు ఉన్న ప్రాధాన్యత దేనికీ ఉండదు, రాజకీయాల్లో అయితే అధికారం అందించే సామాజిక వర్గంగా గెలుపును నిర్ణయించే శక్తిగా చెప్పుకొనే కాపు సామాజిక వర్గం దక్షిణ భారత దేశంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. రాష్ట్రంలో జనాభా 5.30 కోట్లుగా ఉంటే అందులో 25 నుండి 30 శాతంగా దాదాపు కోటిన్నర మించి జనాభా గా చెప్పుకోవచ్చు. వెనుకబడిన కులాల సామాజిక వర్గంగా పేరు ఉన్నా ముందుండి ఏ పార్టీ కి అండగా నిలిస్తే ఆ రాజకీయ పార్టీ చేతనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా గెలుపు ఓటములను నిర్ణయించగల సత్తా కలిగిన సామాజిక వర్గంగా నిలుస్తుంది మిగిలిన సామాజిక వర్గాలతో పోలిస్తే ఏపీలో కాపు సామాజికవర్గం ఓటర్లే ఎక్కువగా ఉండటం ముఖ్యమైన కారణం. రాజకీయ పార్టీల తల రాతలు మార్చగలిగే శక్తి ఉన్న బలమైన ఈ సామాజిక వర్గం నుండి తమ రాతలు మార్చుగలిగే శక్తిగా వెనుకబడిన సామాజిక వర్గాల నుండి ఒక్క రైనా రాజ్యాధికారం చేపట్ట లేని బలహీన స్థితిలో వెనుకే ఉండిపోయారు.
స్వాతంత్య్రం రాక ముందు నుండి బి సి వర్గాలకు రిజర్వేషన్లు ఉండేవి 1915 సం౹౹ లో(జి వో నం 67) కాపులను వెనుక బడిన సామాజిక వర్గంగా గుర్తించారు స్వతంత్య్రం వచ్చాక 1956 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాపులను వెనుకబడిన తరగతుల నుండి తీసేసారు. 1961 లో అధికారిక ఉత్తర్వు ద్వారా బీసీల్లో చేర్చడానికి ప్రయత్నించారు న్యాయ పరమైన తీర్పు వలన సాధ్యం కాలేదు, అప్పటి నుండి కాపుల రిజర్వేషన్ల కోసం డిమాండ్లు, ఉద్యమాలు మొదలయ్యాయి1985 లో వంగవీటి మోహన రంగాగారు కాపునాడు ఏర్పాటు చేశారు 3 ఏళ్ల పాటు రాష్ట్రంమంతా కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేశారు. ఆయన మరణానంతరం మళ్ళీ 1988లో ఉద్యమంగా చేపట్టాలని ప్రయత్నించారు 1994 లో కాపు రిజర్వేషన్ ఉద్యమం మరోసారి ఉధృతమైంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాపులను బీసీలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా కాపులను బీసీలుగా చూపేందుకు సరైన ప్రాతిపదిక లేదని ఆ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.
2016 లో కాపు ఐక్య గర్జన పేరుతో ఉధృతంగా ఉద్యమించాలని ప్రయత్నించి, రైలుకు నిప్పు పెట్టటం, పోలీసు స్టేషన్ ధ్వంసం లాంటి హింసాత్మక ఘటనలు చరిత్ర చెరిగి పోని మచ్చను తెచ్చిపెట్టాయి ఈ సంఘటనల అనంతరం అప్పటి ప్రభుత్వం జస్టిస్ మంజునాధన్ గారి ఆధ్వర్యంలో త్రిసభ్య బీసీ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ అన్ని జిల్లాల్లో పర్యటించి అధ్యయనం చేసి, ప్రజాభిప్రాయాన్ని సేకరించి, అందరి నుంచి విజ్ఞాపన పత్రాలు తీసుకుని, ప్రత్యక్షంగా ప్రజల వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించి విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ కల్పించడంతో పాటు బాగా వెనుకబడిపోయిన కాపు సామాజిక వర్గ అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రిజర్వేషన్ అమలు జరిగినా కూడా సంక్షేమానికి తీసుకున్న చర్యలను కొనసాగించాలని నివేదిక ఇచ్చింది. కమిషన్ నివేదిక ప్రకారం కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు బీసీ - ఎఫ్ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2017 డిసెంబర్లో అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది కానీ కొత్తగా ఏ రిజర్వేషన్లు అయినా 50% పరిధి దాటకూడదు. రిజర్వేషన్ 50% మించితే ఆ రిజర్వేషన్ చట్టబద్ధతపై ప్రభుత్వం వద్ద సరైన ఆధారాలు ఉండాలి. కాపు రిజర్వేషన్ అనేది ఒక ఎన్నికల ఆయుధంగా మారి పోయింది ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఒక మాట గెలిచాక ఇంకో మాట. రాజకీయ ప్రయోజనాల కోసం బటన్ నొక్కి ఖాతాల్లో డబ్బులు వేసి కాపు నేస్తం అంటే వారి అభివృద్ధికి చూపిస్తుంది రిక్త హస్తమే. కోటిన్నర జనాభా ఉన్న కాపు సామాజిక వర్గం నుండి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి 212 కంటే సొంత సామాజిక వర్గానికి ఇచ్చి న్యాయం చేసినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com