ఆత్మకూరు, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 46వ రోజుకు చేరుకుంది. ఆత్మకూరు నియోజకవర్గంలో రైతులకు అవసరమైన మేరకు యూరియా సరఫరా జరగడం లేదు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా, రైతుల సంక్షేమం కోసమే రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, రైతుల ముంగిటికే ఎరువులు అని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఆమడ దూరంలో నిలిచింది. గత పక్షం రోజులుగా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో యూరియా లేకపోవడంతో గ్రామీణ ప్రాంత రైతులు ఆత్మకూరు పట్నానికి పరుగులు తీయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టణంలోని సిండికేట్ ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ, గ్రోమోర్ కేంద్రాల వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. బయట మార్కెట్లో బస్తాకు షుమారు 100 రూపాయలు అదనంగా చెల్లించి కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా అధికారులు స్పందించి రైతు భరోసా కేంద్రాల్లో అన్ని రకాల ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలని ఆత్మకూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ శ్రీధర్ పేర్కొన్నారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని సావడి సెంటర్, సత్రం సెంటర్, చాకలి వీధి, మంగలి వీధి ప్రాంతాలలో పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ కరపత్రాలను పంచుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ పవనన్న ప్రజాబాట సాగుతుంది. ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను తెలుసుకొని జనసేన పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ భరోసా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా డ్రైనేజీ సౌకర్యం, వీధి దీపాల వంటి కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా శ్రీధర్ తెలిపారు. సకల సౌకర్యాలతో ఆత్మకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే ప్రజలందరూ జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు జనసేన పార్టీ నాయకులు వంశీ, చంద్ర, నాగరాజు, ఆనంద్, భాను, ప్రవీణ్, రమేష్, అజయ్, హజరత్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com