వ్యవసాయ కేంద్రాలలో యూరియా మాయం : సిక్కోలు జనసైనికులు
సిక్కోలు జిల్లాలో ఇప్పటి వరకు ఖరీఫ్ పంటలకు ఎక్కువగా యూరియా ఉపయోగిస్తారు. కానీ ఒక్కసారిగా ఎప్పుడూ లేనంతగా యూరియా కొరత ఏర్పడింది. బయట మార్కెట్లలో కూడా దొరకని పరిస్థితి. దొరికినా దానికి అదనంగా ఇంకో ఎరువుల బస్తా తీసుకుంటేనే ఇస్తామని షరతులు పెడుతున్నారు. వ్యవసాయ కేంద్రానికి వచ్చే ఎరువుల బస్తాలను నాయకులు తమకు ఉన్న పలుకుబడి ఉపయోగించి తమకు కావాల్సినన్ని ఎరువుల బస్తాలు తీసుకుపోతున్నారు. కానీ ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న రైతులకు మాత్రం అందడం లేదు. దీంతో నిరాశలో రైతాంగం ఉంది. ఇంత కష్టకాలంలో కూడా రైతుల్ని పట్టించుకునే నాయకులు కరువయ్యారు. అధికారులు కూడా నాయకులతో కుమ్మక్కై అందినకాడికి దోచుకుంటున్నారు. దీని విచారణ జరిపి రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిక్కోలు జనసైనికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.