ఉరవకొండ ( జనస్వరం ) : జనసేన అదినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని ఉరవకొండ జనసేన పార్టీ అధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం విద్యుత్ అధికారులుకు వినతిపత్రం అందజేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం పేద మధ్య తరగతి వారిని నడ్డి విరిచే విధంగా విద్యుత్ చార్జీలను ఇస్తాను సరంగా పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురౌతున్నారు. అధికారంలో వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తం 200 యూనిట్లు వరకు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన వైసిపి నాయకత్వం ఇవాళ 57 శాతం చార్జీలను పెంచింది. ఇపుడు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ఇళ్ళల్లో ఫ్యాన్లు వేసుకోకుండా చేశారు. వైసిపి ప్రభుత్వం అనాలోచిత విధానాలే రాష్ట్ర సంక్షోభాలకు కారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్, మండల అధ్యక్షలు చంద్రశేఖర్, వజ్రకరూరు అద్యక్షులు కేశవ, విడపనకల్ అధ్యక్షుల గోపాల్, కార్యనిర్వహణ కమిటి సభ్యులు అజయ్, ఉపాధ్యక్షులు రాజేష్, హరి శంకర్, దేవేంద్ర, తిలక్, సూర్యనారాయణ, రవి, సోము, తేజ, సర్యనాయక్, కుమార్, కమిటి సభ్యులు పాల్గొన్నారు.