Logo
Date of Publish : 17 June 2021, 3:00 am
Editor : Sake Naresh

ఇసుక కొరత తీర్చాలని, బ్లాక్ మార్కెట్ అరికట్టాలని అధికారులకు వినతిపత్రం అందించిన ఉరవకొండ జనసేన నాయకులు

          అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, బ్లాక్ మార్కెట్ విచ్చలవిడిగా జరుగుతోందని జనసేన నాయకులు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో తహశీల్దార్ గారికి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ  ప్రధాన మంత్రి ఆవాసయోజన జగనన్న కాలనీ పేరిట చాలామంది నిరుపేదలకు ఇళ్లపట్టాలు మంజూరు అయినాయి. ఇప్పటికే చాలామంది ఆ స్థలాలలో ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. కానీ ఇనుక కొరత కారణంగా ఇంటి నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. ఇనుక రీచ్‌ లలో ఇసుక లభించుటలేదు, కానీ బ్లాక్‌ మార్కెట్లలో విచ్చలవిడిగా క్రయవిక్రయాలు గుట్టుచపుడు కాకుండా జరిగిపోతున్నాయి. దయచేసి మీరు ఈ అంశంపై దృష్టిసారించి బ్లాక్‌ మార్కెట్‌ దందాని నిలువరించి అధికారికంగా ఇసుక లభించే విధంగా పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేయుటలో తగు తోడ్పాటును అందించాలని ఉరవకొండ జనసేన పార్టీ తరపున ఈ వినతి పత్రమును అందచేయుచున్నాము అని అన్నారు. ఇసుక రేటు పెరిగి సామాన్యులకు అధిక భారం అవుతుంది. దీని వలన గ్రామాలలో గృహ నిర్మాణం ఆగిపోయి భవన నిర్మాణ కార్మికులు, రోజువారి కూలీలు ఇసుక మీద ఆధారపడి  అనేక మంది కార్మికులు ఆర్ధికంగా నష్టపోతున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు పెంచిన ఇసుక చార్జీలు తక్షణమే తగ్గించాలి అని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com