అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, బ్లాక్ మార్కెట్ విచ్చలవిడిగా జరుగుతోందని జనసేన నాయకులు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో తహశీల్దార్ గారికి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాసయోజన జగనన్న కాలనీ పేరిట చాలామంది నిరుపేదలకు ఇళ్లపట్టాలు మంజూరు అయినాయి. ఇప్పటికే చాలామంది ఆ స్థలాలలో ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. కానీ ఇనుక కొరత కారణంగా ఇంటి నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. ఇనుక రీచ్ లలో ఇసుక లభించుటలేదు, కానీ బ్లాక్ మార్కెట్లలో విచ్చలవిడిగా క్రయవిక్రయాలు గుట్టుచపుడు కాకుండా జరిగిపోతున్నాయి. దయచేసి మీరు ఈ అంశంపై దృష్టిసారించి బ్లాక్ మార్కెట్ దందాని నిలువరించి అధికారికంగా ఇసుక లభించే విధంగా పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేయుటలో తగు తోడ్పాటును అందించాలని ఉరవకొండ జనసేన పార్టీ తరపున ఈ వినతి పత్రమును అందచేయుచున్నాము అని అన్నారు. ఇసుక రేటు పెరిగి సామాన్యులకు అధిక భారం అవుతుంది. దీని వలన గ్రామాలలో గృహ నిర్మాణం ఆగిపోయి భవన నిర్మాణ కార్మికులు, రోజువారి కూలీలు ఇసుక మీద ఆధారపడి అనేక మంది కార్మికులు ఆర్ధికంగా నష్టపోతున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు పెంచిన ఇసుక చార్జీలు తక్షణమే తగ్గించాలి అని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.