త్రాగునీటి పైపులకు మరమ్మతులు చేయాలని RWS అధికారికి వినతిపత్రం ఇచ్చిన ఉరవకొండ జనసేన నాయకులు

    ఉరవకొండ, (జనస్వరం) : ఉరవకొండ పట్టణంతో పాటు ఐదు పరిసర గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చే సత్యసాయి తాగునీరు పైపుల లీకేజీ ఫలితంగా మురుగునీరు ఆ మంచినీటి పైపుల గుండా ప్రవహించి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నింబగల్లు సత్యసాయి తాగునీటి ట్యాంకుల ద్వారా ఉరవకొండ పట్టణంలోకి సరఫరా అవుతున్న మూడు నీటి పైపులు పగిలిపోవడం వలన రెండు రోజులుగా త్రాగునీరు వృథాగా పోతోంది. అలాగే మురుగునీరు ఆ పైపుల గుండా ప్రవహిస్తూ ఆ నీటిని తాగుతున్న ప్రజలు అస్వస్థతకి గురి అవుతున్నారు. ఈ త్రాగునీటి పైపులను వెంటనే త్వరితగతిన మరమ్మతులు చేయించి ప్రజారోగ్యం కాపాడవలసిందిగా RWS అధికారి గారికి ఉరవకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు బోయ చంద్రశేఖర్ గౌడ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షులు రాజేష్, అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శులు, కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు దేవేంద్ర, అజయ్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way