ఉరవకొండ, (జనస్వరం) : ఆకలి అన్నవారికి రాత్రి పగలు అనే తేడా లేకుండా స్వయంగా తన చేతులతో అన్నం వండి పెట్టిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ. కష్టాల్లో ఉన్నవారిని పేదలను ఆదుకొంటూ లేదనకుండా నిత్యాన్నదానము జరిపిన అపర అన్నపూర్ణ ఈ సీతమ్మ. ఉభయ గోదావరి జిల్లాల్లో అన్నపూర్ణ అనే ప్రసిద్ధమైన పేరుతో ఖండాంతర ఖ్యాతి గడించారు. 'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అనే మాట వింటూనే ఉంటాం కానీ అన్నదానానికి మించిన దానంలేదని నమ్మిన అమ్మ డొక్కా సీతమ్మ. అమ్మ అనే పదానికి అసలైన నిర్వచనం చెప్పిన మహా మానవతా మూర్తి. తన ఇంట్లో రోజుకు 24 గంటలూ పొయ్యి వెలుగుతునే ఉండేది. అంతటి మహోన్నత అన్నదాత పేరుతో అన్నదాన శిబిరం ప్రతి సోమవారం ఉరవకొండ పట్టణంలోని గుంతకల్ రోడ్డులో ఉన్న మార్కెట్ యార్డ్ నందు జనసేన మండల ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఉరవకొండ మండల కార్యదర్శి విశ్వనాథ్ ఆధ్వర్యంలో సోమవారం రోజు డొక్కా సీతమ్మ క్యాంటీన్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు జనసైనికులు మాట్లాడుతూ మార్చి14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం డొక్కా సీతమ్మ క్యాంటిన్ ను ఉరవకొండ పట్టణం స్థానిక మార్కెట్ యార్డ్ నందు జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఉరవకొండ మండల కార్యదర్శి విశ్వనాధ్ ఆధ్వర్యంలో క్యాంటిన్ ను ప్రారంభించడం జరిగింది. అదే విధంగా ప్రతి సోమవారం డొక్కా సీతమ్మ క్యాంటిన్ నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ గౌడ్, తిలక్, (మాల)సోము, నిలకంట, విజయ్, హరి, జొల్ల మణికంఠ, రంగా, మోపిడి హరి(శ్రీజ పాలు) తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క జనసైనికులకు, నాయకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని వారు పేర్కొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com