యూపీహెచ్సీ అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగుల్ని విధులకు దూరం చేయడం భావ్యం కాదు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్

కర్నూలు

యూపీహెచ్సీ అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగుల్ని విధులకు దూరం చేయడం భావ్యం కాదు
– కోవిడ్‌ ఉధృతిలో ధైర్యంగా ఆ ఉద్యోగులు చేసిన సేవలను గుర్తించాలి
– జనసేనని పవన్ కల్యాణ్
      హైదరాబాద్, (జనస్వరం) : పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూపీహెచ్సీ) అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్న 1700 మంది ఉద్యోగులను వారి బాధ్యతల నుంచి ఒక్కసారిగా దూరం చేయడం బాధాకరమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏళ్ల తరబడి ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్‌నర్సులుగా, ల్యాబ్‌ టెక్నీషియన్లుగా, ఎఎన్‌ఎంలుగా, ఫార్మసిస్టులుగా.. ఇలా అనేక బాధ్యతల్లో పని చేస్తున్న వారిని రోడ్డునపడేశారన్నారు. యూపీహెచ్సీ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ప్రతినిధులు తమ బాధలను, ఆవేదనను జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారు. పేద రోగులకు అందుబాటులో ఉంటూ వైద్య సేవల్లో భాగంగా తమ విధులను చేపడుతున్న వారిని అందుకు దూరం పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో యూపీహెచ్సీలో విధులు నిర్వర్తిస్తున్న వీరంతా ఎంతో ధైర్యంగా సేవలు చేశారన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ముందుకే వెళ్లారు. టెస్టుల నుంచి వ్యాక్సినేషన్‌ వరకూ ఎన్నో కీలక విధుల్లో పని చేశారు. అందుకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉండగా – ఉద్యోగ భద్రత లేకుండా చేయడం భావ్యం కాదని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో మరో ఏజెన్సీని తీసుకున్నాం కాబట్టి పాతవారికి పని లేదు అని చెప్పడంలో అర్ధం లేదు. ఏజెన్సీ మారితే ఉపాధి పోవాలా? కొత్త ఏజెన్సీ కోసం ఉన్న ఉద్యోగులను బలి చేస్తారా? లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి… ఇప్పుడున్న ఉద్యోగుల సేవల్ని నిలిపిీవయడం ఏమిటి? యూపీహెచ్సీల్లో అనుభవం ఉన్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను విధుల్లో కొనసాగించాలన్నారు. ఈ చిరుద్యోగులకు జనసేన పార్టీ బాసటగా నిలుస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way