ఆమదాలవలస ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆదివారం నాడు ఆమదాలవలస మండలం కొత్తవలస గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి జనసేన అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ హాజరై జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అంతా తానై వ్యవహరించిన స్థానిక నాయకులు పైడి ధనుంజయ రావుని అభినందించారు. జనసేన తెలుగుదేశం పొత్తుల భాగంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూనే జనసేన పార్టీ అభివృద్ధి కోసం జనసైనికులు అందరూ కూడా పాటుపడాలని సూచించారు. ఈ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన కూన రవికుమార్ గారిని అసెంబ్లీకి పంపించేందుకు అన్ని విధాల కృషి చేస్తానని అలాగే జనసైనికులు అందరూ స్థానిక టిడిపి నాయకులతో సమన్వయం చేసుకుంటూ సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ మరియు ఆముదాలవలసలో రాక్షస పాలన అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన , నియోజకవర్గ సీనియర్ నాయకులు పాత్రుని పాపారావు, పాలకొండ జనసేన నాయకులు, గర్భాన సత్తిబాబు, సరుబుజ్జిలి మండల అధ్యక్షులు పైడి మురళి మోహన్, స్థానిక టిడిపి మాజీ సర్పంచ్ గురుగుబెల్లి మోహన్ రావు, పేడాడ అప్పలనాయుడు గారు, సుశీల గారు ప్రసాదరావు, శ్రీనువాసరావు, జయరాం,రాంబాబు, గణేష్, కోటి, రాజేంద్ర, సతీష్, అశోక్, రాము, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com