Logo
Date of Publish : 08 June 2026, 6:21 am
Editor : Sake Naresh

సర్ అవగాహన సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

- జూన్ 14న జూబ్లీహిల్స్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం
హైదరాబాద్, జూన్ 8 (జనస్వరం) : జూన్ 14న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిర్వహించనున్న సర్ అవగాహన సదస్సు మరియు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ విష్ణువర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 14న సవేరా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే అవగాహన సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమాల విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు సోహైల్‌తో పాటు మాజీ కార్పొరేటర్లు దేదీప్య, రాజ్‌కుమార్ పటేల్, శ్యాంరావు, మాజీ డివిజన్ అధ్యక్షులు సంజీవ్, ప్రదీప్, అరుణ్, రాకేష్, జహీర్, విజయ్‌ కుమార్, ఖదీర్ భాయ్, లియాఖత్ అలీ, వినోద్, సుశీల్, అర్జున్, కన్యాకుమారి, సుధాకర్, సతీష్ దాస్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూన్ 14న నిర్వహించనున్న అవగాహన సదస్సు విజయవంతం కావడానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు, పార్టీ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com