Logo
Date of Publish : 30 January 2026, 3:20 pm
Editor : Sake Naresh

ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి 9వ ఆవిర్భావ దినోత్సవ పాంప్లెట్ ఆవిష్కరణ

 

అనంతపురం, జనవరి 30, జనస్వరం : నగరంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ పాంప్లెట్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా PHPS నాయకులు మాట్లాడుతూ… 2018 సంవత్సరంలో స్థాపితమైన ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి నాయకత్వాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ క్రిస్టెన్ అన్ని వర్గాల హక్కుల పరిరక్షణ కోసం, మహిళల పైన దాడులు దౌర్జన్యాలు చిన్న పిల్లల పైన దాడులు దౌర్జన్యాలు జరుగుతున్న దాడులను ఖండిస్తూ వ్యతిరేకిస్తూ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న ఆల్ ఇండియా PHPS వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మన్నెపాకుల మాధవ్ నాయకత్వంలో ఈ 9వ వార్షికోత్సవం పాంప్లెట్ విడుదల చేయడం జరిగిందన్నారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు, పంట నష్టపరిహారం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సబ్సిడీలు, ఉచిత బోర్లు, భూమిలేని రైతులకు ఉచిత, పేద రైతన్నలకు 3 ఎకరాలు భూమి ఇవ్వాలి, ఇల్లులేని పేదలకు మూడు సెంట్లు మరియు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 8వ తేదీన అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్‌లో ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి 9వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజాసంఘాల నాయకులు, బడుగు బలహీన వర్గాల నాయకులు, మేధావులు, అన్ని వర్గాల నాయకులు అందరూ కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా PHPS జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అంజి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహులు, జిల్లా గౌరవ అధ్యక్షులు అశోక్ రెడ్డి, గౌరవ ఉపాధ్యక్షులు సాకే నాగరాజు నగర అధ్యక్షుడు జగదీష్ నాయుడు, నగర గౌరవాధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, నగర గౌరవ ఉపాధ్యక్షులు కరీం భాషా, నగర ప్రధాన కార్యదర్శి ఆదిశేషు, నగర కమిటీ సభ్యులు మసూర్ భాష, రామాంజనేయులు, గట్టు రామాంజనేయులు, సాకే కుళ్లాయప్ప, రఫ్తార్ ఇంచార్జ్ గోపాల్ రెడ్డి, రాప్తాడు ప్రధాన కార్యదర్శి మనోహర, పెద్దన్న, నల్లప్ప, కళ్యాణ్ చక్రవర్తి, రవికుమార్, ఎం.గోపాల్, ఆదన్న శేషు బాబా బక్రీద్ శివ కృష్ణ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com