గుంటూరు ( జనస్వరం ) : నిలువెల్లా అహం, అహంకారం నింపుకున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వల్ల రాష్ట్రం అన్నివిధాలా సర్వనాశనం అయ్యిందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నియంత చేతిలో రాష్ట్రం చిక్కి శల్యమైపోయిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక శ్రీనివాసరావుతోటలోని గాజు గ్లాస్ దిమ్మె వద్ద ఒక వ్యక్తి అహం ... రాష్ట్రం సర్వనాశనం పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. 22 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ జగన్ రెడ్డి అహం వల్ల రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్రప్రదేశ్ కునారిల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి కోలుకోలేని దుస్థితికి వెళ్ళిపోయిందని ధ్వజమెత్తారు. ఒక నియంతకు, ఒక ఫ్యాక్షనిష్టుకి అధికారం ఇస్తే ఎంత విధ్వంసం జరుగుతుందో ఐదేళ్ల జగన్ రెడ్డి పాలన చూస్తే అర్ధమవుతుందన్నారు. ప్రజాదరణ కోల్పోయిన జగన్ రెడ్డి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చకొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. చొక్కాలు మడతపెట్టాల్సిన సమయం వచ్చిందంటూ సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే వ్యాఖ్యానించటం హేయమన్నారు. రాష్ట్రం నుంచి వైసీపీని తరిమికొట్టినప్పుడే ముందుతరాల వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ సమస్య లాంటిదన్నారు. ప్రజలందరూ కులమతాలకతీతంగా, పార్టీలకతీతంగా ఏకతాటిపైకి వచ్చి వైసీపీలేని ఆంధ్రప్రదేశ్ ను సాధించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు కోల్పోయిన వాక్ స్వంతత్ర్యాన్ని , భద్రతను సాధించుకోవటానికి మరో స్వాతంత్ర్య పోరాటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆళ్ళ హరి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెల్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్టీ, డీపీ డివిజన్ అధ్యక్షుడు షేక్ నాగూర్, కొలసాని బాలకృష్ణ, రామిశెట్టి శ్రీనివాస్, కోలా అంజి, నండూరి స్వామి, వడ్డె సుబ్బారావు, బాలు, పగిడిపోగు రమేష్, కోలా మల్లి, పోతురాజు, జిలాని, మస్తాన్ వలి, బియ్యం శ్రీను, తాడికొండ శ్రీను, కాసులు, రేవంత్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com