సత్తెనపల్లి ( జనస్వరం ) : నకరికల్లు మండలం నకరికల్లు గ్రామంలో జనసేన పార్టీ జండా ఆవిష్కరణలు, నకరికల్లు గ్రామ కమిటీ సభ్యులు మరియు పెద్దల ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, మరియు జిల్లా కమిటీ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామ పొలిమేర నుంచి జెండా ఆవిష్కరణకు వెళ్లే దారి పొడవునా భారీ ర్యాలీ ,డీజే, పెద్దల ఆశీర్వచనాలతో, నీరాజనాలతో, మహిళల హారతులతో అంగరంగ వైభవముగా జరిగింది.. జనసేన పార్టీ నగరికల్లు గ్రామ కమిటీ వారు ఏర్పాటు చేసిన నాలుగు నూతన పార్టీ జెండాలను ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లిక, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, జిల్లా కార్యదర్శి యర్రంశెట్టి రామకృష్ణ,జిల్లా సంయుక్త కార్యదర్శిలు సిరిగిరి శ్రీనివాసరావు, తిరుమల శెట్టి మల్లేశ్వరి, అధికార ప్రతినిధి తవిటి భవన్నారాయన అధిక సంఖ్యలోజనసేన అభిమానులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com