Logo
Date of Publish : 18 February 2024, 10:10 pm
Editor : Sake Naresh

గొలుగువలస గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ

    బొబ్బిలి ( జనస్వరం ) : నియోజకవర్గం తెర్లాం మండలం గొలుగువలస గ్రామంలో నాయకులు ఆదినారాయణ, కిరణ్, శంకర్, గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షలు మరడాన రవి అధ్యక్షతన ఆదివారం ఘనంగా జెనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పడాల అరుణ, జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, సమన్వయకర్త గిరడ అప్పల స్వామి, పలువురు నియోజకవర్గ ఇంచార్జి లు పాల్గొన్నారు. పడాల అరుణమ్మ మాట్లాడుతూ జనసేన పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకే జెండా ఆవిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే గ్రామంలో ఉన్న జనసేన నేతలకు తెలియజేసినట్లయితే వాటి పరిష్కారం కోసం పోరాడుతామన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిందని, ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో జనసేన + టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి గెలిపించాలని పిలుపునిచ్చారు, జనసైనికులు పై ఆక్రమ కేసులు పడితే ఎదురుకునేందుకు పార్టీ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. బాబు పాలూరు గారు మాట్లాడుతూ జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆపడానికి ఎన్నో విధాలుగా అడ్డంకులు సృష్టించినా, ధైర్యంతో ముందుకు వచ్చినటువంటి జనసేనకులకు పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని అన్నారు. రాజకీయ నాయకులకు మీఓట్లు, మీ మీ పిల్లల కావాలి కానీ, మన పిల్లలు మాత్రం రాజకీయ నాయకులుగా ఎదుగుతామంటే ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని మహిళలకు వివరించారు. ఓటు అనేది ప్రజాక్షేత్రం లో ఎంతో విలువైనదని, ఎంతోమంది మేధావులను అధికారం నుంచి ప్రజలు దూరం పెట్టారని, ప్రస్తుత పరిస్థితిలో యువత వోటింగ్ చాలా అవసరమని అన్నారు. వారికి గౌరవం చేసుకోవలిసిన అవసరం రాజకీయ పార్టీలకు ఉందని తెలిపారు, జనసేన - టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో ఏర్పడ్డక గొలుగు వలస గ్రాములో త్రాగు నీటి సమస్యను, పార్టీలకు అతీతంగా అర్హులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందిస్తామని తెలిపారు. గ్రామంలో ప్రజలకు ఉపయోగ కార్యక్రమాలు చేయడానికి యువత ముందుకు వస్తే, ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని, సొంత నిధులతో రచ్చబండ ని ఏర్పాటు చేస్తామని జనసైనికులు ముందువస్తే లేనిపోని అడ్డంకులు పెడుతున్నారని, ఈ విషయాన్ని గ్రామ ప్రజలు ఆలోచన చేయాలనీ, జనసేన పార్టీ ని ఆదరించాలని కోరారు, గ్రామంలో ఎటువంటి సమస్యలు వున్నా పార్టీ దృష్టికి తీసుకొని వస్తే వాటి పరిస్కారం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. ఆక్రమ కేసులతో బయపెట్టాలని చుస్తే తాట తీస్తామని హెచ్చరించారు. రాజకీయాలు రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో జనసైనికులు, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com